Sunday, 28 January 2018

చిరంజీవిగారి పాటల్లో నా మోస్ట్ ఫేవరేట్ అది: ప్రభాస్

మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ మెగా హీరో సాయి ధరం తేజ్ ల కాంబోలో సీ.కల్యాణ్ తెరకెక్కిస్తోన్న `ఇంటెలిజెంట్ ` చిత్రం ఆడియోను అనూహ్యంగా నేడు విడుదల చేశారు. వాస్తవానికి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఒక ఆడియో సింగల్ రిలీజ్ చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఆడియో ఫంక్షన్ జరపడం లేదని మీడియా ముందే అన్ని పాటలు రిలీజ్ చేయబోతున్నామని సీ.కల్యాణ్ తెలిపారు. మొదటి పాట విడుదలైన ప్రతి నాలుగు గంటలకు ఒక్కో పాట చొప్పున విడుదల చేస్తామని నిర్మాత  తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని రిలీజ్ డేట్ ను కన్ ఫర్మ్ చేశారు. 

ఈ చిత్రంతో సాయిధరమ్ తేజ్ అద్భుతంగా నటించాడని తప్పక విజయం సాధిస్తుందని వీవీ వినాయక్ చెప్పారు. ప్రభాస్ అంటే స్నేహానికి నిలువెత్తు రూపమని - ఇండస్ట్రీలో  ఫ్రెండ్ షిప్ కు వ్యాల్యూ ఇచ్చే అతి కొద్దిమందిలో ప్రభాస్ ఒకడని అన్నారు. మామూలుగా ఫోన్ చేసి రమ్మనగానే ఫంక్షన్ కు వచ్చాడని ప్రభాస్ రాకతో తమ యూనిట్ అంతా హ్యాపీగా ఉన్నామన్నారు. ప్రభాస్ తమ ఇంట్లో మనిషిలా చాలా ఫ్రెండ్లీ గాఉంటాడని పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలని చైతూ చెప్పాడు. 

ప్రభాస్ ఈ సినిమాలోని `లెట్స్ డూ...`అనే సాంగ్ ను రిలీజ్ చేశాడు. తనకు వినాయక్ చాలా మంచి మిత్రుడని...ఫోన్ చేసి మొహమాటంగా ఫంక్షన్ కు రావడం కుదురుతుందా అని అడిగారని...కానీ మీరు మెసేజ్ పెట్టండి...ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని చెప్పానని ప్రభాస్ అన్నాడు. యోగి సినిమాకు ఎంజాయ్ చేసినట్లు తాను ఏ సినిమాకు ఎంజాయ్ చేయలేదని ప్రభాస్ అన్నాడు. రాజమౌళిగారికి కూడా ఇదే విషయాన్ని చెప్పానని - వినాయక్ గారు హీరోలకు ఫ్రీడమ్ ఇస్తారని చెప్పాడు.ఇదే విషయాన్ని చైతూతో కూడా చెప్పానని అన్నాడు.అయితే - చిరంజీవి గారి పాట్లో చమక్ చమక్ చాం...పాట తన ఫేవరెట్ అని....ఆ పాటకు చైతూ స్టెప్పులు ఎలా వేశాడో చూడాలని వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ కన ఫమ్ అవడంతో ఇద్దరు మెగా హీరోల మధ్య పోటీ ఖాయం.


https://tollywoodmoviesadda.blogspot.in/


No comments:

Post a Comment

Hridayapoorvam movie story

Here’s a summary of Hridayapoorvam (2025), a Malayalam romantic comedy-drama directed by Sathyan Anthikad: --- Main ...