Thursday, 22 February 2018

సమ్మర్ బాక్స్ ఆఫీస్ వేడిగా ఉంది

http://tollywoodmoviesadda.blogspot.in/

దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నట్లుగానే టాలీవుడ్ కూడా మార్కెట్ ను కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళుతోంది. మొన్నటి వరకు తెలుగు సినిమాలంటే దేశంలో మూడవ ఇండస్ట్రీ అనేవారు. అంటే అత్యధిక మార్కెట్ లో బాలీవుడ్ - కోలీవుడ్ తరువాత అని సంబోదించేవారు. కానీ మన దర్శకుల కసి వల్ల బాలీవుడ్ సినిమాలతో మన సినిమాలు పోటీ పడుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ కూడా ఇప్పుడు టాప్ లో ఉంది మరి. 

గత ఏడాది జక్కన్న ఆ విషయాన్ని బాహుబలితో చెప్పాడు. సమ్మర్ లో అసలైన బాక్స్ ఆఫీస్ మాజాని చూపించాడు. ఇప్పుడు ఆ బాధ్యతను మరో దర్శకులు తీసుకున్నారు. మన స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ లో భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయనున్నాయి. మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలు ఈ సమ్మర్ లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 260 కోట్ల బిజినెస్ చేసేలా ఉన్నాయి. అంత కాకపోయినా డొమెస్టిక్ మార్కెట్ లో కనీసం 225 కోట్ల దాటుతాయని అంచనాలున్నాయి. దీన్ని బట్టి సమ్మర్ బాక్స్ చాలా వేడిగా ఉందని చెప్పవచ్చు. 

ముందుగా రామ్ చరణ్ సినిమా వస్తోంది. ఈ సినిమా అన్ని బిజినెస్ వ్యవహారాలు దాదాపు అయిపోయాయి. 80 కోట్ల ప్రీ బిజేసన్ చేసింది. దర్శకుడు సుకుమార్ కాబట్టి కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇక భారత్ అనే నేను అయితే ప్రీ బిజినెస్ 100 కోట్లు దాటేసింది. అల్లు అర్జున్ - నా పేరు సూర్య 80 కోట్లతో ఆశ్చర్యపరుస్తోంది. సినిమాలకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా షేర్స్ సంఖ్య చాలా  పెరిగే అవకాశం ఉందని బాక్స్ ఆఫీస్ పండితులు చెబుతున్నారు. మరి ఎవరు ఎంత లాగుతారో చూడాలి. 

No comments:

Post a Comment

Hridayapoorvam movie story

Here’s a summary of Hridayapoorvam (2025), a Malayalam romantic comedy-drama directed by Sathyan Anthikad: --- Main ...