Wednesday, 21 February 2018

ఫోటో స్టోరి: బ్లాక్ అండ్ వైట్ లో ఎంత హాటో

http://tollywoodmoviesadda.blogspot.in/

మలయాళీ భామ అను ఇమాన్యుయేల్ కు టాలీవుడ్ పట్టం కట్టేసిన సంగతి తెలిసిందే. వరుస అవకాశాలతో ఈ వయ్యారి దూసుకుపోతోంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి నిరుత్సాహపరిచినా.. అందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన అను కెరీర్ కి వచ్చిన ఇబ్బంది పెద్దగా ఏమీ లేదు. ఇప్పటి వరకూ ఆన్ స్క్రీన్ పై వీలైనంత పద్ధతిగా కనిపించిన అను ఇమాన్యుయేల్.. రియల్ లైఫ్ లో మాత్రం మహా హాట్ నెస్ ప్రదర్శించేస్తూ ఉంటుంది. 

రీసెంట్ గా ఓ ఈవెంట్ కోసం ఈ అమ్మడు రెడీ అయిన తీరు చూసి అందరిలోనూ సెగలు పుట్టేశాయి. బ్లాక్ డ్రెస్ కి వైట్ ఓవర్ కోట్ తగిలించి.. అను ఇచ్చిన పోజులు అందరికీ మతులు పోగొట్టించేశాయి. హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ మాదిరిగా అను ఇచ్చిన పోజులను అదరహో అనాల్సిందే. అంతగా ఫోటోలలో హాట్నెస్ పంచేస్తూ.. తను ఎంతటి స్పీడ్ అనే విషయాన్ని మేని మెరుపులతోనే చెప్పేస్తోంది అను ఇమాన్యుయేల్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. 

వీటిలో అల్లు అర్జున్ తో నటిస్తున్న నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అత్యంత కీలకమైనది. అమ్మడి పాత్ర సినిమాలో పరిమితంగానే ఉంటుందనే సంగతి అర్ధమవుతున్నా.. ఈ సినిమాలో గ్లామర్ యాంగిల్ అంతా అను చుట్టూనే తిరుగుతుందనే విషయం ఒప్పుకోవాల్సిందే. ఓ కమర్షియల్ మూవీలో హీరోయిన్ గా హిట్టు కొడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

2 comments:

  1. MOJO TV - India’s First Mobile Generation News Network. We are here to give latest telugu news updates and telugu varthalu Along with movie reviews and also latest updates on politics and entertainment.

    ReplyDelete
  2. thank you for your valuable information.i like your all post and also check this also for letest film news

    ReplyDelete

Hridayapoorvam movie story

Here’s a summary of Hridayapoorvam (2025), a Malayalam romantic comedy-drama directed by Sathyan Anthikad: --- Main ...