Friday, 12 January 2018

ఈ బ్రెయిన్ లెస్ పాత్రలేంటి సామీ!!


కథానాయిక అంటే ఈ రోజుల్లో గ్లామర్ పాత్రలకే ఎక్కువగా పనికొస్తారా అని కొన్ని సినిమాలను చూస్తుంటే అర్ధమవుతోంది. చిన్న తరహా హీరోల నుంచి స్టార్ హీరోల వరకు వారి సినిమాల్లో ఒక్కోసారి కథానాయికలు ఎందుకు ఉంటారో అర్ధం కాదు. రెమ్యునరేషన్ వల్లనో లేక స్టార్ హీరో అనే అభిప్రాయమే తెలియదు గాని హీరోయిన్స్ మాత్రం కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు అనేది ఒక టాక్. ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ కథలో హీరోయిన్స్ కి ప్రాధాన్యత ఉంటుంది. 

కానీ అది ఏ లెవల్లో ఉంటుందో అనే విషయంపై కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాధారణంగా త్రివిక్రమ్ కథలో కథానాయికలు చాలా దద్దమ్మలా ఉంటారు. మరి దాన్ని అమాయకత్వంతో అనుకోవాలో లేక ఇంకేమనుకోవాలో తెలియదు గాని త్రివిక్రమ్ పెన్ను మాత్రం కథానాయికలపై సెటైర్ వేసే విధంగానే ఉంటుంది. ఆయన మొదటి సినిమాల నుంచి చూస్తే నువ్వే నువ్వే లో శ్రీయ నుండి ఇక అతడు - జల్సా - అత్తారింటికి దారేది సినిమాల్లో టాప్ హీరోయిన్స్ త్రిష - అనుష్క - సమంతలు చాలా మంద బుద్దిని కలిగి ఉంటారు. ఆ పాత్రలపై వేసే సెటైర్లు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. ఇక అఆ సినిమాలో కూడా అదే తరహాలో సమంత పాత్ర ఉంటుంది. బ్రెయిన్ లెస్ అన్న తరహాలోనే చూపిస్తాడు మాంత్రికుడు. 

కానీ రీసెంట్ గా వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో అయితే దారుణం. అసలు హీరోయిన్స్ పాత్రలు వచ్చిన విధానం అస్సలు అర్ధం కాదు. ఇక వారి డైలాగ్స్ కూడా అసలు త్రివిక్రమ్ రాసినట్టుగా లేవు. ఇంతకుముందు వచ్చిన పాత్రలు చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉండేవి కానీ అజ్ఞాతవాసిలో అను ఇమ్మాన్యుయేల్ - కీర్తి సురేష్ పాత్రలు కొత్తగా ఉన్నాయి అనడం కన్నా చెత్తగా ఉన్నాయి అనడం బెటర్. మరి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో త్రివిక్రమ్ హీరోయిన్ విషయంలో ఏమైనా మార్పులు చేస్తాడో లేదో చూడాలి. సామీ.. అనుకో.. పాత్ర మారుతుంది. 

No comments:

Post a Comment

Hridayapoorvam movie story

Here’s a summary of Hridayapoorvam (2025), a Malayalam romantic comedy-drama directed by Sathyan Anthikad: --- Main ...