Monday, 15 January 2018

పులిహోర.. తినటానికి ఎవరైనా వస్తున్నారా?

తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు యాంకర్ సుమ. ప్రతి తెలిగింటి లోగిలిలోనూ చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరికి తెలిసిన ఆమె.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మహా యాక్టివ్ గా ఉంటున్నారు. తనదైన సరదా ధోరణితో అందరిని అలరించే ఆమె.. రియల్ గానూ అంతే చురుగ్గా ఉంటూ అందరి అభిమానాన్ని పొందుతున్నారు.

రీల్ అయినా రియల్ అయినా ఒక్కలానే ఉంటానన్నట్లుగా ఉండే సుమ.. తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. గ్లామర్ పీల్డ్ లో ఉన్నోళ్లు ఎలాంటి వీడియోలు షేర్ చేయరో.. సరిగ్గా అలాంటి వీడియోను షేర్ చేయటం సుమకు మాత్రమే సాధ్యమేమో. పెద్ద జర్మన్ సిల్వర్ పాత్రలో పెద్ద ఎత్తున పులిహోర కలపటమే కాదు.. ఎలాంటి మేకప్ లేకుండా సింఫుల్ గా.. ఇంట్లో ఎలా ఉంటానో అలానే కెమేరా ముందు తాను తయారు చేస్తున్న చింతపండు పులిహోర గురించి చెప్పుకొచ్చారు.

పాత్రలోని అన్నంలో పులిహోర పేస్ట్ ను కలిపే క్రమాన్ని పొట్టి వీడియోలో ప్రదర్శించారు. వంటల ప్రోగ్రామ్ ను ఇమిటేట్ చేసినట్లుగా పులిహోర కలుపుతున్న సుమ దగ్గరగా పెంపుడు కుక్క రావటంతో.. ఏయ్ నువ్వు ఇటు రావొద్దంటూనే.. ఎవరైనా వస్తున్నారా పులిహోర టేస్ట్ చేయటానికి అంటూ ఇన్వైట్ చేసేసింది. సుమ పులిహోర ఇన్విటేషన్ ఇప్పుడు ఆన్ లైన్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందరి మోముపై చిరునవ్వులు చిందేలా చేస్తోంది.

No comments:

Post a Comment

Hridayapoorvam movie story

Here’s a summary of Hridayapoorvam (2025), a Malayalam romantic comedy-drama directed by Sathyan Anthikad: --- Main ...