Thursday, 11 January 2018

మహేశ్.. రియల్ శ్రీమంతుడే బాస్!

తెలుగువారికి ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన మహేశ్ బాబు. ఆ మధ్యన కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు మూవీని చేశారు. ఈ సినిమా పలువురిని కదిలించటంతో పాటు.. తమ సొంతూరుకు ఏదైనా చేయాలన్న కాంక్షను పెంచేలా చేసిందని చెప్పాలి.

రీల్ లోనే కాదు.. రియల్ గా కూడా అసలుసిసలు శ్రీమంతుడు మహేశ్ అనిపించేలా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాను నటించిన సినిమాలో మాదిరే.. మహేశ్ రియల్ గా తన తండ్రి సొంతూరైన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. 


అదేసమయంలో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఏదో దత్తత తీసుకున్నామంటే.. ప్రచారం కోసం తీసుకున్నామన్న ధోరణికి భిన్నంగా మహేశ్ వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్ని సమీక్షించటం.. పెద్ద ఎత్తున చేపట్టటం చేస్తున్నారు. 


మహేశ్ స్వయంగా పనులు నిర్వహించకున్నా.. ఆయన తరపున మహేశ్ సతీమణి నమత్రా శిరోద్కర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.తాజాగా ఆయన దత్తత తీసుకున్న కొత్తూరులో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నెట్టింట్లో హడావుడి చేస్తున్నాయి. కొత్తూరు గ్రామంలో ఒక స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు నెట్ లోకి వచ్చి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

No comments:

Post a Comment

Hridayapoorvam movie story

Here’s a summary of Hridayapoorvam (2025), a Malayalam romantic comedy-drama directed by Sathyan Anthikad: --- Main ...